Telangana: బీజేపీలో చేరికలకు బ్రేక్!

Telangana: ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలను సాధిస్తూ వేగంగా ముందుకు సాగిన కమలం పార్టీ ఇప్పుడు ఆ జోరును కోల్పోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో వరుసగా పలువురు కీలక నేతలు చేరినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఆ ఉత్సాహం తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు బీజేపీ వైపు చూడటంలో వెనకడుగు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరిన తర్వాత తమకు దక్కే ప్రాధాన్యతపై స్పష్టత లేకపోవడం, నాయకత్వం నుంచి సరైన గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో...