Marriage Scam: నిత్య పెళ్లికూతురు.. 9 మందిని పెళ్లాడి.. చివరికి
దేశంలో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక భారీ నేరజాలం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా, వివాహం పేరుతో నమ్మించి లక్షల రూపాయలు దోచుకుని పరారవుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఒక మహిళ ఏకంగా 9 మందిని వివాహం చేసుకుని, ప్రతి సారి నగదు, బంగారు ఆభరణాలతో పారిపోయిన విషయం బయటపడటంతో ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడు యోగేష్ షిండే ఫిర్యాదు మేరకు ఈ...