Telangana: రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త

Telangana: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు బియ్యం పంపిణీకి పరిమితమైన ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇకపై జొన్నలను కూడా అందించాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానుంది. రైతుల నుంచి నేరుగా జొన్నలను సేకరించి, వాటిని రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యతో ఒకవైపు రైతులకు మార్కెట్ భరోసా లభిస్తుండగా, మరోవైపు పేద ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేసి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా...