Hyderabad: అర్ధరాత్రి ఆపరేషన్‌.. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు షాక్

Hyderabad: మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే కఠిన నిర్ణయాలతో ముందుకు వచ్చిన ఐపీఎస్ అధికారి సుమతి.. నగర భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంచలన చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్న దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌ను లక్ష్యంగా ఎంచుకుని, అర్ధరాత్రి వేళ స్వయంగా ఫీల్డ్‌లోకి దిగడం ద్వారా పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేశారు. అధికార హోదాలో కాకుండా, ఒక సాధారణ మహిళలా ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా రోడ్డుపై నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తూ అక్కడి వాస్తవ పరిస్థితిని కళ్లారా చూశారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు అక్కడే ఉండి, నగరంలో మహిళలు...