Viral Story: రావి చెట్టుకు మామిడి కాయలు?.. మీరెప్పుడైనా చూశారా?
Viral Story: సాధారణంగా జాతీయ రహదారులపై వాహనాలు అత్యంత వేగంతో దూసుకెళ్తూ ఉంటాయి. అయితే విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతానికి చేరుకున్న వెంటనే వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ ఆశ్చర్యంతో నిలిచిపోతున్నారు. రోడ్డు పక్కన కనిపిస్తున్న ఓ విభిన్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఉన్న ఒక భారీ రావి చెట్టు కొమ్మలన్నీ మామిడికాయలతో నిండిపోయినట్లుగా కనిపించడం వల్ల వెళ్లేవారంతా ఆగి మరీ చూస్తున్నారు. రావి చెట్టుకు మామిడికాయలు కాయడం ఎలా సాధ్యమవుతుందనే సందేహంతో చాలామంది దగ్గరకు వెళ్లి గమనిస్తున్నారు. అయితే కొద్దిసేపు పరిశీలిస్తే ఆ దృశ్యం వెనుక అసలు నిజం బయటపడుతోంది. ఇది ప్రకృతి సృష్టించిన వింత కాదని, ఒక సాధారణ వ్యాపారి తెలివైన...