Supreme Court: ట్రాన్స్‌జెండర్ల హక్కులపై కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు

Supreme Court: ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కీలక పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ సవరణ బిల్లు - 2026’పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సవరణ బిల్లు వ్యక్తుల స్వయం నిర్ణయాధికారాన్ని ఉల్లంఘిస్తోందని పలు పిటిషన్లు దాఖలుకాగా, వాటిపై ధర్మాసనం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరిన న్యాయస్థానం, బిల్లులోని నిబంధనలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువైన అంశం ఏమిటంటే.. ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తన లింగ గుర్తింపును అధికారికంగా ధృవీకరించుకోవాలంటే తప్పనిసరిగా...