Andhra Pradesh: అన్నం పెట్టలేదని భార్యపై కొడవలితో దాడి
Andhra Pradesh: పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు ఘోర పరిణామానికి దారితీశాయి. అన్నం పెట్టలేదన్న చిన్న కారణంతోనే భర్త రాజేంద్ర ప్రసాద్ తన భార్య బాడిస పాపాయమ్మపై దారుణంగా దాడి చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారం ప్రకారం ఇంట్లో జరిగిన సాధారణ వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, ఆవేశానికి లోనైన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న కొడవలితో భార్యపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ముఖ్యంగా కడుపు భాగంలో గాయాలు కావడంతో పాపాయమ్మ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, సమీప గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను...