Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి అమల్లోకి కొత్త విధానం

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతను పెంచడం, లబ్దిదారులకు వేగంగా సేవలు అందించడం లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకం అమలులో ఇప్పటివరకు ఎదురైన సాంకేతిక సమస్యలు, ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని యాప్‌లో సమగ్ర మార్పులు చేపట్టింది. ముఖ్యంగా లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడటంతో పాటు, ఎంపిక ప్రక్రియను సులభతరం చేయడానికి అత్యాధునిక విధానాలను ప్రవేశపెట్టింది. ఈ మార్పుల ద్వారా లబ్దిదారులను త్వరగా గుర్తించడం, వారి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం, పథకం అమలు వేగాన్ని పెంచడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. పాత విధానాలను పూర్తిగా పక్కనబెట్టి, ఆధునిక సాంకేతికత ఆధారంగా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ రూపంలోకి...