Hyderabad: కొత్త వైద్య విప్లవం.. సనత్‌నగర్ టిమ్స్‌లో ఓపీ షురూ
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆరోగ్య రంగానికి మరొక కీలక ముందడుగు పడింది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి కార్యకలాపాలు ప్రారంభ దశలోకి అడుగుపెట్టాయి. అధికారిక ప్రారంభానికి ముందుగానే సేవల నాణ్యతను అంచనా వేయడానికి ట్రయల్ రన్ ప్రారంభించగా, శుక్రవారం నుంచి ఓపీ సేవలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి రోజే 22 మంది రోగులకు వైద్యులు ప్రత్యక్షంగా పరిశీలించి చికిత్స అందించారు. అవసరమైన ఔషధాలను వారికి ఉచితంగా అందించడం ప్రత్యేకంగా నిలిచింది. బోరబండ ప్రాంతానికి చెందిన మణెమ్మ ఈ ఆసుపత్రిలో సేవలు పొందిన తొలి రోగిగా నమోదు కావడం విశేషం. ఎర్రగడ్డలో విస్తరించిన...