Thiruvarur: లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం
Thiruvarur: దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే పవిత్ర క్షేత్రాల్లో తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో వెలసిన మేఘనాథస్వామి- లలితాంబిక ఆలయం అత్యంత విశిష్ట స్థానం సంపాదించుకుంది. పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా, అమ్మవారు లలితాంబికగా భక్తుల పూజలు అందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం శక్తి, శివ తత్వాల సమన్వయానికి ప్రతీకగా నిలుస్తోంది. మహాదేవుడు అమ్మవారిని శాంతపరిచిన పవిత్ర స్థలంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. లలితా పారాయణం, లలితా సహస్రనామ పఠనం, స్తోత్రాలు ఇక్కడ చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం బలంగా ఉంది. అందుకే ఈ ఆలయాన్ని దివ్యశక్తి క్షేత్రంగా భావిస్తూ దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శనానికి తరలివస్తుంటారు. తిరువారూర్ జిల్లా కేంద్రానికి సుమారు...