Interesting Facts: సింహాలు హైనాలను చంపుతాయి.. కానీ తినవు.. ఎందుకో తెలుసా?

Interesting Facts: అడవిలో సింహాలు, హైనాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న పోటీ వెనుక ఆసక్తికరమైన జీవశాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకే ఆహార వనరులపై ఆధారపడే ఈ రెండు మాంసాహార జాతులు తరచూ పరస్పరం ఘర్షణలకు దిగుతుంటాయి. ముఖ్యంగా వేట భూములు, ఆహారం, ఆధిపత్యం కోసం వీటి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. అయితే ఈ పోటీలో ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే సింహాలు హైనాలను చంపినా సాధారణంగా వాటిని ఆహారంగా తీసుకోవు. ఇది చాలా మందిలో సందేహం రేకెత్తించే అంశంగా ఉంటుంది. కానీ దీనికి ప్రకృతి వ్యవస్థలోని ప్రత్యేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సింహాలు సాధారణంగా పోషక విలువలు ఎక్కువగా ఉండే, సులభంగా జీర్ణమయ్యే...