IPL 2026: ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోనే కుప్పకూలిన సాహిల్ (VIDEO)
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుని తీవ్ర ఆందోళనను రేపింది. జట్టు ప్రాక్టీస్ సమయంలో యువ ఆటగాడు సాహిల్ పారఖ్ ప్రమాదకరంగా గాయపడడంతో మైదానంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా, శుక్రవారం సాయంత్రం జరిగిన సాధనలో ఈ ప్రమాదం సంభవించడం జట్టును కలవరపరిచింది. సాహిల్ పారఖ్ బ్యాటింగ్ సాధన చేస్తుండగా, వేగంగా వచ్చిన బంతి అతని ముఖానికి, ముఖ్యంగా నోటిపై బలంగా తగిలింది. ఒక్కసారిగా దెబ్బ తగిలిన వెంటనే అతని నోటినుంచి రక్తం ప్రవహించడంతో అక్కడున్న...