Uttar Pradesh: పెళ్లింట పెను విషాదం.. ఐదుగురు దుర్మరణం..!
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మౌ జిల్లా పరిధిలో శనివారం ఏప్రిల్ 25 తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దోరిఘాట్ ప్రాంతంలోని బర్సాత్పూర్-అహిరానీ జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక స్కార్పియో వాహనం అదుపు కోల్పోయి ముందుగా డివైడర్ను ఢీకొట్టి, ఆ ప్రభావంతో అవతలి లేన్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద...