Kavitha: తెలంగాణలో కర్కోటకుడి పాలన

Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచేలా తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నయా హిట్లర్, కర్కోటకుడి తరహా పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించగా, మరోవైపు బీఆర్ఎస్ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ మూడు ప్రధాన పార్టీల...