XPeng: సరికొత్త విప్లవం.. రెక్కలొచ్చిన కార్లు.. మాట్లాడే రోబోలు
XPeng: సాంకేతిక ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో, ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే చూసిన అద్భుతాలు ఇప్పుడు నిజ జీవితంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ మార్పులో చైనా దేశానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ XPeng కీలక పాత్ర పోషిస్తోంది. రవాణా, రోబోటిక్స్ రంగాల్లో సంచలనాత్మక పరిణామాలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంస్థ 2027 నాటికి విప్లవాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో మన ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చేలా ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లు రవాణా రంగంలో పెద్ద మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. ఈ వాహనాలు...