Medical Terminology: డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై కోడ్ లాంగ్వేజ్ అర్థం కావట్లేదా?

Medical Terminology: వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు అందులో కనిపించే సంక్షిప్త పదాలు చాలామందికి అర్థంకాని కోడ్‌లా అనిపిస్తాయి. కానీ ఇవి యాదృచ్ఛికంగా రాసిన అక్షరాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రమాణిత వైద్య పరిభాషలో భాగం. ముఖ్యంగా సమయాన్ని ఆదా చేయడం, స్పష్టతను పెంచడం కోసం ఈ సంకేతాలను ఉపయోగిస్తారు. అందులో అత్యంత సాధారణంగా కనిపించేది Rx. ఇది లాటిన్ భాషలోని “రెసిపీ” అనే పదం నుంచి వచ్చినది. దీని అర్థం “తీసుకోండి” అని. అంటే వైద్యుడు సూచించిన మందులను వాడాలని సూచన. అలాగే Dx అనే పదం రోగ నిర్ధారణను సూచిస్తుంది. రోగి ఏ వ్యాధితో బాధపడుతున్నాడో దీనిలో నమోదు చేస్తారు. మరోవైపు Sx అంటే...