Viral Video: ఓర్నీ.. అంబులెన్స్‌ను రన్నింగ్ ఓయోగా మార్చిన కిలాడీలు

Viral Video: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు ఉపయోగించే అత్యవసర సేవ అంబులెన్స్. అలాంటి ప్రజల ప్రాణాలను కాపాడే వాహనాన్ని కొందరు యువకులు పూర్తిగా దుర్వినియోగం చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన 108 అంబులెన్స్‌ను వ్యక్తిగత వినోదం కోసం వినియోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. https://twitter.com/ocjain4/status/2047109273256333634?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2047109273256333634%7Ctwgr%5E5b4b2db9d71f5b4073493a6fe37cec7ddd869e70%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Focjain4%2Fstatus%2F2047109273256333634 వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా చూస్తే.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక అంబులెన్స్‌లో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వారిని స్థానికులు గమనించారు. వాహనం...