Air Conditioner: మళ్లీ పెరిగిన ఏసీల ధరలు

Air Conditioner: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాల్పులు, ఉక్కబోత కారణంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్లు వెలవెలబోతున్నాయి. ఇంటి బయటకు రావడానికే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో చల్లదనం కోసం ఏసీలు, కూలర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సమ్మర్ ప్రారంభం నుంచే ఏసీలకు భారీ డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్‌లో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరిగినా కూడా ప్రజలు అవసరానికి మించి ఖర్చు చేసి అయినా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఈ...