Natural Skin: ఈ సీక్రెట్ ఫేస్ పాక్‌తో 40 ఏళ్లలోనూ 20 ఏళ్ల వెలుగు

Natural Skin: చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మలినాలు, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే వీటికి ఖరీదైన చికిత్సలకంటే మన వంటింట్లో దొరికే సహజ పదార్థాలతోనే అద్భుతమైన పరిష్కారం పొందవచ్చు. సహజ పదార్థాలతో తయారుచేసే ప్యాక్‌లు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, దానికి కొత్త కాంతిని అందించడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు, పసుపు, పాలు, ముల్తానీ మట్టి, కుంకుమపువ్వు, జాజికాయ, శనగపిండి వంటి పదార్థాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. పెసలతో తయారుచేసే ప్యాక్ చర్మంపై పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా పెసలను స్వల్పంగా వేయించి, వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి....