Telangana Politics: ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నాయకులు కీలక పర్యటనలకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కే.చంద్రశేఖర్ రావు హాజరుకానుండగా, అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మైండ్ గేమ్ మొదలైందా అనే సందేహాలకు తావిస్తున్నాయి. దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత ప్రజల ముందుకు రాబోతున్న కేసీఆర్ సభపై ప్రత్యేక దృష్టి...