Andhra Pradesh: దేవుడా.. ఇంత కంటే అన్యాయం ఉంటుందా?

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరింత విషాదాన్ని మిగిల్చింది. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో బొలెరో గూడ్స్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొనడంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదం జరిగిన వెంటనే 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మొత్తం మరణాలు 9కు పెరిగాయి. మృతులందరూ కర్ణాటక రాష్ట్రంలోని శెట్టిగేరే ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం పలు కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదంలో లోలాక్షి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె ఇద్దరు కుమార్తెలు...