AP Polycet 2026: హాల్ టికెట్లు వచ్చేశాయ్..
AP Polycet 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన కీలక ప్రక్రియలు వేగవంతమయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. పరీక్షకు దరఖాస్తు చేసిన వారు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి సులభంగా హాల్ టికెట్ పొందవచ్చు. దీంతో పాటు వాట్సప్ గవర్నెన్స్ సౌకర్యం...