Cooking oil effects: అతిగా నూనె వాడితే గుండెకు ప్రమాదమేనా?

Cooking oil effects: మన భారతీయ వంటకాలలో నూనెకు విడదీయలేని స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి వంటకంలోనూ నూనె వినియోగం తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే రుచిని పెంచేందుకు అధికంగా ఉపయోగించే ఈ నూనె మన ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు తినే అలవాట్లు కూడా మారిపోవడంతో దేశంలో ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సగటున 23.5 లీటర్ల నూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఆరోగ్య పరంగా ఆందోళన కలిగించే విషయం. సరైన మోతాదులో నూనె తీసుకోవడం శరీరానికి అవసరమైనప్పటికీ, మోతాదు మించితే గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, రక్తపోటు వంటి...