Telangana: వినూత్న ఆలోచన.. బంకుల్లో దర్శనమిస్తున్న కూలర్స్
Telangana: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, బయటకు అడుగుపెడితే నిప్పుల కుంపటిలో ఉన్నట్టుగా అనిపించే పరిస్థితి నెలకొంది. ఒకవైపు మండుతున్న ఎండ, మరోవైపు వడగాలుల తీవ్రత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీవ్ర వేడి ప్రభావంతో రోడ్లపై ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండగా, కొన్నిచోట్ల పెట్రోల్ వాహనాలు కూడా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని నిర్మల్...