Indian Railways: ఈ ట్రైన్ ప్రత్యేకతలు తెలుసా?.. 3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే..
Indian Railways: కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా సరికొత్త ఆధునిక రైలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టి దేశ రవాణా రంగంలో కొత్త దశను ప్రారంభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఢిల్లీ – మీరట్ మధ్య నడిచే ఈ ఆధునిక రైలు సేవ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్రజలకు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. గతంలో ఈ మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది కాగా, ప్రస్తుతం కేవలం 55 నుండి 60 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 82 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను కలిగి ఉండగా,...