Promissory Note: ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ తప్పులు చేస్తే పైసలు పోతాయ్!
Promissory Note: ఆర్థిక లావాదేవీల్లో ప్రామిసరీ నోట్ అనే పత్రం సాధారణ కాగితం కాదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇది సరైన విధంగా తయారు చేస్తే బలమైన చట్టబద్ధ ఆధారంగా మారుతుంది. ముఖ్యంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ మరియు లిమిటేషన్ యాక్ట్ పరిధిలో ప్రామిసరీ నోట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ పత్రంపై ఉన్న తేదీ నుంచి సరిగ్గా 3 సంవత్సరాల గడువు మాత్రమే చట్టపరంగా అమల్లో ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత అది చెల్లుబాటు కోల్పోతుంది. అయితే గడువు ముగిసేలోపు సరైన చర్యలు తీసుకుంటే దీన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రామిసరీ నోట్ గడువు పొడిగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. రుణగ్రహీత...