Moon Transit: చంద్ర బలంతో వారికి అన్నింటా సక్సెస్..!

Moon Transit: గ్రహాల సంచారం మనిషి జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతుందనే విశ్వాసం జ్యోతిష్య శాస్త్రంలో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు రాశి మార్పు చెందే సమయంలో వ్యక్తుల మానసిక స్థితి, ఆలోచనా విధానం, నిర్ణయాలు, కోరికలు వంటి అంశాల్లో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏప్రిల్ నెలలో 16, 17, 18 తేదీల్లో చంద్రుడు మీన రాశిలో శని, కుజ, బుధ గ్రహాలతో కలిసి సంచారం చేయడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గ్రహస్థితి కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రయత్నాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల...