Astrology: ఆడ, మగవారికి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదంటే?

Astrology: మన శరీరంపై కనిపించే పుట్టుమచ్చలను చాలా మంది సాధారణ లక్షణాలుగానే భావిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం, సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇవి కేవలం గుర్తులే కాకుండా, వ్యక్తి జీవిత గమనం, స్వభావం, ఆర్థిక పరిస్థితి, అదృష్టం వంటి అంశాలను సూచించే సంకేతాలుగా పరిగణిస్తారు. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించే పుట్టుమచ్చలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్నిచోట్ల ఉన్న మచ్చలు అత్యంత శుభప్రదంగా భావించబడితే, మరికొన్ని చోట్ల ఉన్నవి మిశ్రమ లేదా ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చని చెబుతున్నారు. నాలుకపై పుట్టుమచ్చ ఉండటం అత్యంత శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇలాంటి వారు మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి జీవితంలో...