Gas Safety Tips: గ్యాస్ లీక్ అయిందని కంగారుపడకండి.. ముందు ఈ పని చేయండి!
Gas Safety Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ అనే విషయం వినగానే చాలా మందిలో భయం కలగడం సహజం. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురవుతుంటారు. అయితే నిపుణుల సూచనల ప్రకారం సరైన జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు, లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటుండటంతో ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్యాస్ లీకేజీ వల్ల చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర చర్యలు తెలుసుకోవడం చాలా కీలకం. గ్యాస్ సిలిండర్ను ఇంటికి తీసుకునే సమయంలోనే జాగ్రత్తలు...