Elephants Teeth: ఏనుగుకు బయటకు కనిపించే రెండు దంతాలతో పాటు నోట్లో ఏమైనా పళ్లు ఉంటాయా?

Elephant Teeth: అడవిలో అతి పెద్ద జీవిగా పేరుగాంచిన ఏనుగు గురించి మనకు చాలా విషయాలు తెలిసినా, దాని దంతాల నిర్మాణం గురించి చాలామందికి పూర్తి అవగాహన ఉండదు. సాధారణంగా ఏనుగుకు రెండు పెద్ద దంతాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఈ దంతాలు ముందుకు పొడుచుకుని కనిపించడం వల్ల అవే ప్రధానమైనవిగా భావిస్తారు. అయితే, వాస్తవానికి ఈ రెండు దంతాలు కేవలం ఆత్మరక్షణకు, చెట్ల కొమ్మలను విరగ్గొట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆహారం నమలడానికి ఇవి ఉపయోగపడవు అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఏనుగు నోటిలో అసలు ఎన్ని దంతాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది....