After Death: మరణం తర్వాత ఇన్ని దశలా..?
After Death: మరణం తర్వాత ఏమి జరుగుతుందనే ప్రశ్న మానవాళిని ఎన్నో శతాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. పౌరాణిక కథలు, సినిమాలు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం మనిషి ప్రాణం విడిచిన వెంటనే యముడు లేదా ఆయన దూతలు వచ్చి తీసుకెళ్తారని, పాపపుణ్యాల ఆధారంగా స్వర్గం లేదా నరకానికి చేరుతారని అనేక మంది విశ్వసిస్తుంటారు. అయితే దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక విచిత్ర కథనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూసఫ్ షకుర్ అనే వ్యక్తి గీసిన ఒక బొమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆ చిత్రంలో అతడు మరణం...