Science Discovery: డైనోసార్ రియల్ వాయిస్ ఇలా ఉంటుందట!
Science Discovery: భారీ ఆకారం, గంభీరమైన నడక, భయానక రూపం.. డైనోసార్లు అంటే మనకు గుర్తొచ్చేది ఇదే. వాటి గర్జన వినిపిస్తే గుండెల్లో పులకరింత కాకుండా భయం పుడుతుందని సినిమాలు మనకు నమ్మించాయి. ముఖ్యంగా జురాసిక్ పార్క్ వంటి చిత్రాలు డైనోసర్లను అత్యంత భయానకంగా చూపిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. అయితే ఇప్పటివరకు మనం విన్న ఆ గర్జనలు నిజంగా డైనోసర్లవేనా అన్న ప్రశ్నకు తాజా పరిశోధనలు ఆశ్చర్యకర సమాధానాలు ఇస్తున్నాయి. సినిమాల్లో వినిపించే భారీ గర్జనలు వాస్తవానికి పూర్తిగా కల్పితమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసర్లను మనిషి ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడకపోవడం వల్ల, సినిమాలు చూపించిన దృశ్యాలనే నిజంగా నమ్ముతూ వచ్చాం. గత...