Mosquito Bite: దోమలకు రక్తం రుచి చూపించింది ఎవరంటే?

Mosquito Bite: చిన్న పరిమాణంలో కనిపించే దోమలు మనుషుల జీవితాలపై చూపిస్తున్న ప్రభావం మాత్రం విపరీతంగా ఉంది. సాధారణంగా ఒక చిన్న కాటు అనిపించినా, దాని వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ దోమలు మొదట్లో మనుషుల రక్తాన్ని తాగేవి కావని పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా మనిషి రక్తాన్ని రుచి చూసిన దోమలు, ఆ తరువాత అదే అలవాటుగా మార్చుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి వరకు అవి ఇతర జంతువులపై ఆధారపడి జీవించేవని, కాలక్రమేణా మనుషుల దగ్గర...