Interesting: భర్త మరణించాక మంగళసూత్రం ఏం చేయాలంటే?
Interesting: భారతీయ సంస్కృతిలో ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా వివాహం అనంతరం మహిళలు ధరించే మంగళసూత్రం, గాజులు, మెట్టెలు వంటి ఆభరణాలకు ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉంటుంది. ఇవి కేవలం అలంకరణకు సంబంధించినవి మాత్రమే కాదు.. దాంపత్య బంధానికి ప్రతీకలుగా కూడా భావించబడతాయి. అందుకే భర్త మరణించిన తర్వాత ఈ ఆభరణాలను ఏం చేయాలి? వాటిని కొనసాగించి ధరించాలా? లేక తీసివేయాలా? వాటిని ఎవరు తీసుకోవాలి? వంటి అనేక సందేహాలు కుటుంబాలలో చర్చకు వస్తుంటాయి. కొందరు అయితే చనిపోయిన వ్యక్తి వాడిన బంగారు ఆభరణాలను మరొకరు ధరించడం వల్ల దోషం వస్తుందని కూడా భయపడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య, ఆచార సంప్రదాయాలపై అధ్యయనం...