Mysteries of Creation: సైంటిస్టులు కూడా చెప్పలేని 7 మిస్టరీలు!

Mysteries of Creation: మనిషి జీవితంలో ఖాళీ సమయాలు వచ్చినప్పుడు మనసు ఎన్నో ప్రశ్నలతో నిండిపోతుంది. ఆలోచనల ప్రవాహం ఒక్కసారిగా పెరిగి ప్రపంచం గురించి, సృష్టి గురించి, జీవితం గురించి అనేక సందేహాలు మనలో తలెత్తుతాయి. ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, మనిషి శరీరంలో జీవం ఎలా మొదలైంది, మనల్ని నడిపించే జీవశక్తి ఏమిటి, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నలు వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. చాలా ప్రశ్నలకు మనుషులు సమాధానాలు కనుగొన్నప్పటికీ కొన్ని విషయాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. ఈ రహస్యాలను తెలుసుకోవాలని అనేక మంది శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు ప్రాచీన భారతీయ జ్ఞాన సంపద...