Hindu Festival: 2026 పంచాంగం ప్రకారం శ్రీరామనవమి ఎప్పుడు తెలుసా?

Hindu Festival: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ధర్మం, న్యాయం, నిజాయితీ, పరిపాలనలో ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడి అవతార దినంగా ఈ పండుగను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. రామాయణంలో శ్రీరాముడు చూపిన నీతి, నిబద్ధత, బాధ్యత వంటి విలువలను స్మరించుకునే సందర్భంగా ఈ పండుగను భావిస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, పారాయణాలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాసం పాటిస్తూ శ్రీరాముడిని స్మరించి ఆయన కృపను కోరుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా శ్రీరామనవమి తేదీ విషయంలో చాలా మందిలో సందేహాలు ఏర్పడుతున్నాయి. నవమి తిథి రెండు రోజులకు వ్యాపించడం వల్ల పండుగను...