Wedding Traditions: పెళ్లికి ముందు 7 తరాలు కచ్చితంగా చూసే సంప్రదాయం.. ఎక్కడో తెలుసా? (VIDEO)

Wedding Traditions: ప్రపంచంలోని ప్రతి దేశానికి తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహాల విషయంలో ప్రతి సమాజం కొన్ని నియమాలు, ఆచారాలను పాటిస్తుంది. మన దగ్గర పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు “అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి” అనే మాట తరచుగా వినిపిస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం ఎక్కువగా మాటలకే పరిమితమైపోయింది. కానీ ప్రపంచంలో ఒక దేశం మాత్రం ఇప్పటికీ ఈ విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ తన సంస్కృతిని కాపాడుకుంటోంది. ఆ దేశం కజకిస్తాన్. అక్కడ పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు వధూవరులు తమ కుటుంబాల ఏడు తరాల పూర్వీకుల వివరాలను తెలుసుకోవడం తప్పనిసరిగా భావిస్తారు. ఈ...