Crow Intelligence: కాకులను చీప్‌గా చూడకండి.. దాని ప్రత్యేకతలే వేరు

Crow Intelligence: మన ఇళ్ల ఆవరణలో, వీధి మూలల్లో, చెట్ల కొమ్మలపై గట్టిగా అరుస్తూ తిరిగే కాకులను మనం చాలా సార్లు సాధారణ పక్షులుగానే భావిస్తుంటాం. నలుపు రంగులో మెరుస్తూ కనిపించే వాటి శరీరం, గరగరలాడే గొంతు స్వరం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించం. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. మనుషులకే ప్రత్యేకమని భావించిన అత్యున్నత మేధస్సు లక్షణాలు ఈ చిన్న జీవుల్లోనూ ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా న్యూ కాలెడోనియన్ జాతికి చెందిన కాకులు సమస్యలను విశ్లేషించి, తగిన పరిష్కారాలను కనుగొనే సామర్థ్యంతో పక్షి ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇవి ఎదురైన...