Telugu New Year: ఉగాది పండుగ వైభవం, విశిష్టత

Telugu New Year: ప్రకృతి పచ్చని వన్నెలు అద్దుకుని వసంత సోయగాలతో మెరిసే కాలంలో ఆనందోత్సాహాల నడుమ తెలుగువారు ఆహ్వానించే తొలి పండుగ ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే ఈ శుభదినం కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఇంటింటా మామిడి తోటల సువాసనలు, కోయిల కుహూకుహూ స్వరాలు, పచ్చని తొరణాలు, రంగవల్లులు కలసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. సంప్రదాయ వంటకాలతో, పెద్దల ఆశీర్వాదాలతో, పంచాంగ శ్రవణంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2026 మార్చి 19 గురువారం రోజున మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న ఈ పర్వదినం విశిష్టత గురించి పండితులు అనేక పురాణ, శాస్త్రీయ, సాంస్కృతిక విశేషాలను వివరిస్తున్నారు. పురాణాల...