Devotional: పుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్లలా?
Devotional: ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి, మధ్యలో మరెవరి ఇళ్లకు వెళ్లకూడదు అనే నియమం శాస్త్రాలలో స్పష్టంగా పేర్కొనబడలేదు. ఇది కాలక్రమేణా ఏర్పడిన ఒక ఆచార పరంపర మాత్రమే. పెద్దలు చెప్పిన ఈ ఆచారం వెనుక ఉన్న భావం మాత్రం ఎంతో ఆధ్యాత్మికమైనది. క్షేత్రంలో స్వామి దర్శనం ద్వారా కలిగే దైవానుభూతి, మనసుకు వచ్చే ప్రశాంతత, భక్తి భావం ఇవన్నీ ఆ క్షణాల్లో అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆ అనుభూతిని అలాగే మనసులో దాచుకుని, ఇంటికి చేరుకుని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ సమారాధన చేయడం శ్రేయస్కరం అని భావించారు. ఆ తర్వాత ఆ తీర్థప్రసాదం, అనుభవాన్ని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పంచుకోవాలని...