Holi 2026: హోలీ పండుగ.. మార్చి 3వ తేదీనా లేక 4వ తేదీనా?
Holi 2026: హిందూ సంప్రదాయాల్లో ఉత్సాహం, ఉల్లాసం కలగలిపిన వేడుకలలో హోలీ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రంగులతో నిండిన ఈ మహోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. ఋతువుల మార్పుకు సంకేతం ఇచ్చే ప్రకృతి సంబరంగా కూడా భావించబడుతుంది. శీతాకాలం ముగిసి వసంత ఋతువు అడుగుపెట్టే వేళ ప్రకృతిలో కనిపించే కొత్త తేజస్సును, పుష్పాల పరిమళాన్ని, పచ్చదనపు ఉల్లాసాన్ని ప్రతిబింబిస్తూ హోలీ సంబరాలు ప్రారంభమవుతాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా, ద్వేషంపై ప్రేమ గెలిచిన సూచికగా, అసమానతలపై సమానత్వ భావం వెలుగొందిన ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా, సామాజిక వర్గాల మధ్య భేదం లేకుండా...