Milk Adulteration: కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా గుర్తించడం ఎలా?

Milk Adulteration: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి శరీరానికి బలం, ఎముకలకు దృఢత్వం అందిస్తాయి. చిన్నారుల ఎదుగుదల నుంచి వృద్ధుల ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతి వయసులోనూ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అధిక లాభాల ఆశతో కొందరు అక్రమ వ్యాపారులు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వివిధ రకాల రసాయనాలు, డిటర్జెంట్లు, సింథటిక్ పదార్థాలు కలిపి ప్యాకెట్ల రూపంలో ప్రజలకు అమ్ముతూ ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం వినియోగించే పాలు స్వచ్ఛమైనవో కాదో తెలుసుకోవడం అత్యంత అవసరం. రోజువారీ జీవితంలో టీ, కాఫీ వంటి పానీయాల...