Gold Ring: 2 గ్రాముల బంగారంతో ఉంగరం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుందంటే?

Gold Ring: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ ఉండటంతో ఆభరణాల కొనుగోలు విషయంలో వినియోగదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెద్ద పెద్ద దుకాణాల్లో రెడీమేడ్ నగలు కొనుగోలు చేయడం కంటే తాము ఇష్టపడిన నమూనాతో తక్కువ బరువులో తయారు చేయించుకోవడానికే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న ఆభరణాలైన ఉంగరాలు, చెవిపోగులు, మంగళసూత్రాల వంటి వాటిపై డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2 గ్రాముల బంగారంతో ఉంగరం చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్న చాలామందిలో ఉత్కంఠ కలిగిస్తోంది. బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, విదేశీ మారకపు విలువలు, దేశీయ డిమాండ్, దిగుమతి సుంకాలు వంటి అనేక...