Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే సరైన దిశ ఎక్కడో తెలుసా?

Vastu Tips: ప్రస్తుతం మనిషి జీవితంలో ధనం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రతి అవసరం, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. అయినప్పటికీ కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదనే బాధ వ్యక్తం చేస్తుంటారు. సంపాదన ఉన్నా సేవింగ్స్ లేకపోవడం, ఆదాయం ఉన్నా ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఆశ్రయిస్తారు. ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలవాలంటే, సంపాదించిన ధనం స్థిరంగా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం డబ్బు నిల్వ చేసే ప్రదేశం ఎంతో ముఖ్యం. ఇంటి మూలల్లో...