Ganga: మన దేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక్క నది ఏదంటే?

Ganga: భారతదేశ భౌగోళిక నిర్మాణంలో నదులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్నినదులు తూర్పు దిశగా ప్రవహిస్తే, మరికొన్నివి పడమర వైపు సాగుతాయి. పర్వతాలు, మైదానాలు, అటవీ ప్రాంతాలు దాటి ఎన్నో రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అయితే దేశంలో అత్యధిక రాష్ట్రాల గుండా ప్రవహించే నది ఏది అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే. అదే గంగానది. ఈ మహానది ఏకంగా 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోంది. హిమాలయ పర్వత శ్రేణిలోని గంగోత్రి ప్రాంతంలో పుట్టే ఈ నది అక్కడ భాగీరథి పేరుతో ప్రసిద్ధి చెందింది. అనంతరం దేవప్రయాగ వద్ద అలకనంద నదితో సంగమమై గంగగా...