రేపే మహాశివరాత్రి.. ఇలా చేస్తే శివానుగ్రహం
హిందువుల ఆధ్యాత్మిక పరంపరలో అత్యంత పవిత్రంగా భావించే పర్వదినాలలో మహాశివరాత్రి ఒకటి. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ దినాన్ని భక్తులు అపారమైన విశ్వాసంతో ఆచరిస్తారు. ఈ పవిత్ర సందర్భంలో నియమనిష్ఠలతో శివారాధన చేస్తే పాపాలు నశించి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉపవాసం, రాత్రంతా జాగరణ, అర్ధరాత్రి ప్రత్యేక పూజలు వంటి ఆచారాలతో భక్తులు పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తారు. పురాణ ప్రకారం.. మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య అనంత అగ్నిజ్యోతి రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడని వర్ణించబడింది. ఈ తత్వకథలో అంతర్లీన సందేశం ఎంతో లోతైనది. మన శరీరమనే చీకటిలో దాగి ఉన్న ఆత్మరూప జ్యోతిని గ్రహించడం, ఆ ఆత్మస్వరూపమే...