Valentines Day Special: ప్రేమను ఎన్ని రకాలుగా చెప్పొచ్చొ తెలుసా?

Valentines Day Special: ప్రేమ అనేది కాలాన్ని, సరిహద్దులను దాటి మనసులను కలిపే శక్తి అని పెద్దలు చెప్పిన మాట. అయితే నేటి యువత మాత్రం ప్రేమను కేవలం భావనగా కాకుండా, ప్రత్యేకంగా వ్యక్తపరచాల్సిన అనుభూతిగా భావిస్తోంది. ప్రేమను చెప్పే విధానం కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ మనసులో దాచుకున్న అనుభూతులను వెలిబుచ్చేందుకు యువత ఆసక్తి కనబరుస్తోంది. తమ మనసుకు నచ్చిన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచాలన్నా, ఇప్పటికే జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తితో అనుబంధాన్ని మరింత బలపరచాలన్నా ఈ రోజు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రేమ అనేది కేవలం ఒక మాట కాదు.. అది మనసులో...