Maha Shivaratri: ఈ శివరాత్రి చాలా ప్రత్యేకం.. 300 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగాలతో వస్తుంది

Maha Shivaratri: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. పరమశివుడిని ఆరాధించేందుకు ఈ రోజు భక్తులకు అపూర్వమైన అవకాశంగా భావిస్తారు. భోళేనాథుడు త్రిలోకేశ్వరుడు, భక్తుల పిలుపుకు వెంటనే స్పందించే దయామయుడు అనే విశ్వాసం సనాతన సంప్రదాయంలో బలంగా నాటుకుపోయింది. అందుకే మహాశివరాత్రి రోజున ఆలయాల్లో భక్తుల రద్దీ తారస్థాయికి చేరుతుంది. “ఓం నమః శివాయ” నినాదాలతో దేవాలయ ప్రాంగణాలు మారుమోగుతాయి. ఉపవాస దీక్షలు, జాగరణలు, లింగాభిషేకాలు ఇవి అన్నీ ఈ పవిత్ర రాత్రి ఆధ్యాత్మికతను మరింత గాఢంగా అనుభూతి చేయిస్తాయి. పురాణ పరంపర ప్రకారం ఈ రాత్రినే శివపార్వతుల దివ్య కల్యాణం జరిగినట్లు విశ్వసిస్తారు. మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం...