Political: సీఎం పరకాల పర్యటనలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి..?
Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ...