Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

Crime: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతుల మధ్య చోటుచేసుకున్న కుటుంబ కలహం చివరకు విషాదాంతమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిర అక్కడి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండగా, వారిలో ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడని తెలిసింది. అయితే కొంతకాలంగా వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానం ఇందిరలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని...